![]() |
![]() |

ఆహా ఓటిటి ప్లాట్ఫారం మీద "ప్రాజెక్ట్ కే" పేరుతో ఒక కుకింగ్ షో రాబోతోంది. ఇక ఈ షో మార్చి 6నుంచి రాత్రి 7గంటలకు ప్రతి గురువారం ప్రసారం కాబోతుంది. ఈ కార్యక్రమాన్ని సుమ హోస్ట్ చేయబోతుంది. ఆమెకి హెల్పర్‌గా కమెడియన్ జీవన్ కనిపించబోతున్నారు. ఇందులో బుల్లితెర స్టార్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అమర్ దీప్, అంబటి అర్జున్ "అల్టిమేట్ బ్రదర్స్ ఆఫ్ ది కిచెన్" గాళ్ కనిపించి మంచి కామెడీని అందించబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అయ్యింది. ఈ ప్రోమోలో అంబటి అర్జున్ చేతిలో ప్లేట్ పట్టుకుని ‘అరేయ్ అమర్‌గా... ఫిష్ ఫ్రై తెచ్చానూ.. దీనికి కాంబినేషన్‌గా పచ్చి పులుసు తీసుకునిరా" అంటాడు.
"పచ్చి పులుసు కాదు కానీ.. ఇప్పుడే తాలింపు వేసిన పెరుగన్నం తీచినా. తింటే మైమరచిపోతావ్ తిను" అని అంటాడు అమర్ దీప్. దాంతో అంబటి అర్జున్.. ‘రేయ్ అంటే అన్నానంటావ్ కానీ ఎవ్వడైనా చేపల పులుసులో పెరుగు అన్నం తింటాడారా.. అని ఫన్నీగా ఫైర్ అవుతాడు. దాంతో అమర్ దీప్ నెమ్మదిగా ‘ట్రై చేయి ఒకసారి’ అన్నా అని అంటాడు. "ట్రై చేయడాల్లేవ్.. పైకి పోవడాలే" అని కౌంటర్ ఇస్తాడు అంబటి అర్జున్. దాంతో అమర్ దీప్ అలిగి.. ‘సర్లే అన్నా.. నీకు నాతోనే ప్రాబ్లమ్ అయితే చెప్పు నే వెళ్లిపోతా’ అని లేచి వెళ్లిపోతుంటాడు. అతన్ని ఆపి ‘ఏయ్ ఇందుకె..నిన్ను ఏదన్నా అనాలంటేనే... నాకేదో డౌట్ గా ఉందిరా. మనం ఫస్ట్ రౌండ్‌లో వెళ్లిపోతాం అనిపిస్తుంది’ అని అంటాడు అంబటి. "నిన్ను చూస్తే నాకూ అదే అనిపిస్తుంది" అని కౌంటర్ ఇస్తాడు అమర్ దీప్. "చూశారు కదా.. మా కాంబినేషన్ చెఫ్ మంత్రాలో ఇలా తగలడింది. మీరు కూడా చూసి తగలడండి..కాదు కాదు చూసి ఎంజాయ్ చేయండి ’ అని ఫుల్ ఫన్నీ డైలాగ్స్ తో ఆడియన్స్ ని మెప్పించారు ఇద్దరూ. అయితే మొదట్లో ఫిష్ ఫ్రై అన్నారు తర్వాత చేపల పులుసు ఎలా అయ్యింది భయ్యా అంటూ నెటిజన్స్ కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |